పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో క్యాస్ట్ ఫీలింగ్ బాగా పెరిగిపోయిందా? లోకల్‌గా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించే వాళ్ళంతా సొంత సామాజికవర్గానికి చెందిన వాళ్ళేనా? ఆ విషయంలో పిఠాపురానికి చెందిన మిగతా సామాజికవర్గాల మనోభావాలు ఎలా ఉన్నాయి? సొంత పార్టీవాళ్ళే తప్పుపట్టే పరిస్థితి వచ్చిందా? అక్కడేం జరుగుతోందో అసలు పవన్‌కు తెలుస్తోందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రత్యేకించి…
Pawan Kalyan: ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో బలోపేతం, శ్రమించిన వారికి గుర్తింపు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం పిఠాపురంలో పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే, గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా…
Camphor Aarti into Hundi: కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఒక భక్తురాలు చేసిన నిర్వాకంతో అక్కడ ఉన్న హుండీకి స్వల్ప ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆలయంలో వెలుగుతున్న కర్పూరం హారతిని తీసుకున్న భక్తురాలు దానిని వెళ్లి నేరుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి హుండీలో వేసింది. దీనితో హుండీలో ఉన్న నోట్లకు వెంటనే నిప్పు…
SVSN Varma: టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై మంత్రి నారాయాణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కాకరేపాయి.. అయితే, ఇదంతా వైసీపీ సృష్టించిందేనని కొట్టిపారేశారు మంత్రి నారాయణ.. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణను వర్మ కలవడం.. వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వడం జరిగిపోయాయి.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు నారాయణ.. ఈ…
Minister Narayana: గత రెండు మూడు రోజులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ‘జీరో’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి నారాయణ విశాఖపట్నం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నారాయణను కలిశారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ… వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు..…
Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేసేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నియోజకవర్గంలో రోజూ ఘర్షణ జరుగుతున్న కారణంగానే… అలా చేయాల్సి వచ్చిందని కామెంట్ చేశారు కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ. నాలుగు నెలల నుంచి వర్మ ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆయన స్వయంకృతమేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి. తనని జీరో చేసినట్లు వర్మకు తెలుసునని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలోవివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదుకదా…
SVSN Varma: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది.. పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన కొన్ని సార్లు ఓపెన్ కావడం.. దీనికి ఆయనకు కౌంటర్లు పడిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, తాజాగా మంత్రి నారయణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయి. Read Also: Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు..…
Minister Narayana: కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగూరు నారాయణ టెలీ కాన్ఫరెన్స్ వైరల్ గా మారింది.. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పిఠాపురం వ్యవహారాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చారు.. లైన్ దాటిటే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని వర్మ గురించి ఆడియోలో చెప్పారు. పిఠాపురంలో వర్మ ని జీరో చేశామని, పవన్ కల్యాణ్‌కి, వర్మకి రోజు ఘర్షణ జరుగుతుందని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.. 4 నెలలు నుంచి…
Pawan Kalyan Tour: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మొదటగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో, ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్…
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే ... తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం... ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది?