Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీకి దిగుతున్న తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannah Simhadri to Contest on Pawan Kalyan at Pithapuram: సరిగ్గా నెల రోజుల్లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉండగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే ఉండనుంది అని అందరికీ దాదాపుగా అర్థం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా గెలిపించాలని కూటమి ప్రయత్నిస్తుంటే ఎలా అయినా ఓడించాలని అధికార వైసీపీ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఒక ఆసక్తికరమైన పరిణామం తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండర్ గా మారి సినీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు.
Vijay Deverakonda: హ్యాపెనింగ్ హీరోయిన్ పై కన్నేసిన విజయ్.. నెక్స్ట్ మూవీ ఆమెతోనే?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తనకి ఉన్న కాంటాక్ట్స్ తో ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుని తర్వాత హౌస్ లో నుండి బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ మీద అప్పట్లో కంటెస్ట్ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. అయితే గతంలో జనసేన తరఫున కొన్నాళ్లపాటు ప్రచారానికి వెళ్లిన ఆమె ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఆయన మీదే పోటీకి దిగటం హాట్ టాపిక్ అవుతుంది. మంగళగిరిలో లోకేష్ మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈసారి మాత్రం ఒక పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నుంచి ఆమె అక్కడ పోటీ చేయనున్నట్టు రామచంద్రయాదవ్ ప్రకటించారు. ప్రస్తుత అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత సింహాద్రి రమేష్ తనకు బాబాయ్ వరస అవుతాడని గతంలో పలుసార్లు తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!