Pawan Kalyan Pithapuram Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసేందుకు సిద్ధమైన పిఠాపురంలో.. జనసేన అభ్యర్థిగా తొలి పర్యటనకు సిద్ధమయ్యారు.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. ఇక, ఈ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అయితే, పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో గొల్లప్రోలు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లనున్నారు.. వర్మ ఇంటి దగ్గర లంచ్, విరామం తర్వాత… చేబ్రోలు బహిరంగ సభ దగ్గరికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెళ్తారని.. జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. అయితే, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం.. ఈ రోజు శక్తిపీఠం పురుహుతిక దేవి అమ్మవారిని దర్శనం, వారాహికి ప్రత్యేక పూజలు కార్యక్రమం, దత్త పీఠం దర్శనం రద్దు చేసుకున్నట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, అభ్యర్థిగా తొలిసారి పిఠాపురంలో అడుగుపెట్టబోతున్న జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఎలాగైనా ఈ సారి విజయం అందుకుని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కల్యాణ్. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
Read Also: TS Electric Power: రికార్డుస్థాయిలో విద్యుత్తు వినియోగం.. మే నెల రికార్డులు మార్చిలోనే..