Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పిఠాపురం అసెంబ్లీ నియోజకర్గం పైనే ఉంది.. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే.. ఇక, తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన చీఫ్.. పిఠాపురంలో ఆయన పర్యటన నాల్గో రోజుకు చేరుకుంది.. ఈ రోజు ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జనసేనాని.. బషీర్ బీబీ దర్గాను సందర్శించనున్నారు.. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్నారు పవన్ కల్యాణ్.
Read Also: Bigg Boss Keerthi : దారుణంగా మోసపోయిన కీర్తి.. పోలీస్ స్టేషన్ కు పరుగులు.. ఏమైందంటే?
కాగా, పిఠాపురంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు.. సోమవారం జనసేన గూటికి చేరారు.. పార్టీ కండువాలు కప్పి.. జనసేనలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తనను కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు కూడా ఉన్నాయన్న ఆయన.. వాళ్లు బ్లే్డ్లతో కోస్తున్నారని ఆరోపణలు గుప్పించడం చర్చగా మారింది.. నన్ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రతీ రోజూ వస్తున్నారు.. అందులో కొందరు కిరాయిమూకలు కూడా ఉంటున్నాయి అని విమర్శించారు.. అలా వచ్చే కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎన్నికల తరుణంలో తన భద్రతపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.