Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ నేతల చేతులు కలిశాయి. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ నేత వేగుళ్ల లీలా కృష్ణలు జన సేనాని పవన్ కల్యాణ్ సాక్షిగా చేతులు కలిపారు. పవన్ ఇద్దరు నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు. తనకు అధిష్టానం నుండి తగిన భరోసా వచ్చే వరకు టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకు మద్దతు ఇచ్చే విషయమై ఏ నిర్ణయం తీసుకోలేనని లీలా కృష్ణ మీడియా సాక్షిగా వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే.
Read Also: CM YS Jagan: రేపు సంజీవపురం నుంచి తిరిగి బస్సు యాత్ర ప్రారంభం
ఈ నేపథ్యంలో పిఠాపురం వచ్చిన పవన్ కల్యాణ్ ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడారు. ఇద్దరు కలిసి పని చేసి రాష్ట్రంలో మార్పు కోసం పాటు పడాలన్నారు. లీలా కృష్ణకు తగిన గుర్తింపు ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. అలాగే లీలా కృష్ణకు సముచిత గౌరవం ఇచ్చి చూసుకోవాలని, జన సైనికులందరికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఎమ్మెల్యే వేగుళ్లకు సూచించారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి మండపేట వస్తానని హామీ ఇచ్చారు.