Pawan Kalyan: బాప్టిస్ట్ చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు.. అన్ని మతాలను గౌరవిస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు, బహిరంగ సభలు, సమీక్షలు, ప్రార్థనలు ఇలా సాగుతోంది ఆయన పర్యటన.. ఎన్నికల ప్రచారానికి తాను బరిలోకి దిగుతోన్న పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన ఆయన.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతోన్న విషయం విదితమే కాగా.. నాల్గో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నేడు స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని తెలిపారు జనసేనాని పవన్ కల్యాణ్.
Read Also: Tamilisai: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..
Also Read
మరోవైపు, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఇక, నేటితో పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన ముగియనుండగా.. రేపు తెనాలిలో పర్యటిస్తారు.. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.




తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!