Pawan Kalyan: పిఠాపురం జనసేన కార్యాలయమే నా స్వగృహం.. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో విజయకేతనం ఎగరవేస్తున్నామని తెలిపారు జనసేన అధినేత, పిఠాపురం జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో తన సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఇక, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్.
Read Also: Ugadi 2024: చంద్రబాబుకు అధికార యోగం.. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు..
ఇక, సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో కొత్త టెక్నాలజీలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు.. పిఠాపురంలో పోలీసులకు తెలియకుండానే డబ్బులు వెళ్లిపోతున్నాయన్న ఆయన.. మంత్రి దాడిశెట్టి రాజా డబ్బు అని మొన్న వాళ్ల డ్రైవర్ చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు.. ఎంత మంది మిథున్ రెడ్డిలు వచ్చినా పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.. పవన్ కల్యాణ్‌కు భారీ మెజారిటీ ఇవ్వడానికి పిఠాపురంలో టీడీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ .