ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని చెప్పారు.
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఆలయం వంటి విద్యాలయాన్ని అకృత్యాలకు వేదికగా చేసుకున్నాడో ఘనుడు. అభం శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు..
విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఒక యువకుడు బాలికకు ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడు.