Andhra Pradesh: వార్డెన్, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వాలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో నా పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తి చేయడంతో పాటు ఇంటికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించాడు. విషయం బయటకి రావడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. డిప్యూటీ డీఈవో, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేపట్టారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల పైనే కాకుండా సహచర ఉపాధ్యాయులపై కూడా ఉపాధ్యాయుడు రవి అసభ్య ప్రవర్తన విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయనపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Attack on GirlFriend: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మరో ఘటనలో ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినులపై వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు హాస్టల్‌లో చోటు చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. హాస్టల్ లో పొందుతున్న దాదాపు 45 మంది విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్‌గా బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్ పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫణిశ్రీని శశి కుమార్ మ్యాట్రీన్ గా ఉంచాడు. భార్య పేరు చెప్పి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు శశి కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేయగా.. విచారణలో మరో ఐదుగురు బాధితులు పిర్యాదు చేసినట్టు సమాచారం..
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ మేరకు గంగవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తాను స్కూల్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హాస్టల్ గదుల్లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అసభ్యకరంగా మాట్లాడాడని, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీచక ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్ట సింహాచలం సస్పెండ్ చేశారు. దీనిపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో గత కొంతకాలంగా ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలపై రామకృష్ణ లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో గంగవరం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు పంపనున్నారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడటాన్ని పలువురు గిరిజన సంఘం నాయకులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!