చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు.
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్‌తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.