Andhra Pradesh: అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!
- అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం
- బాధితులను పరామర్శించిన మంత్రి సవిత
- పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
- ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. వారి ఆదేశాలతో 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకోగలిగారన్నారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలించారు.. మరో గంటలో నిందితులను చూపిస్తామన్నారు. ఈ సంఘటనలో ఆరు మంది పాల్గొన్నారని.. వారిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో జగన్ హయాంలో అత్యాచారాలు ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. వారు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
Read Also: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు దుండగులు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే ఆ వివరాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!