Karumuri Nageswara Rao: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.. అయితే, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సర్వేల్లో ఓటమి తప్పదని తెలిపోవడంతో టిక్కెట్లు రావనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల మీద లీకులు ఇచ్చి ఇప్పుడు ట్యాపింగ్ ఆరోపణలు చెయ్యడం అంటే వంకాలేనోడు డొంకపట్టుకుని వెళ్లాడటం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ వదిలి వెళ్లిపోతా…
Pawan Kalyan: నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అధిష్టానం అప్పగించినప్పటి నుంచి పార్టీకి.. ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.. ఇక, తన భద్రతను కుదించడంపై ఆన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్…
Sajjala Ramakrishna Reddy: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ కామెంట్లు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, వైసీపీ నేతలు కోటంరెడ్డిపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. తాజా పరిణామాలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ ట్యాపింగ్ అనేదే లేనప్పుడు.. ఇంకా విచారణ అవసరం ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్…
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కో నేత.. ఒక్కో ఆటంబాంబులాంటి మాటలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పార్టీ మారతారన్న ప్రచారం ప్రకంపనలు రేపుతోంది. ఆయన ఆడియో టేపు దుమారం సృష్టిస్తోంది. దీంతో రేపు సీఎం జగన్ దగ్గర నెల్లూరు పంచాయితీ వుంటుందని తెలుస్తోంది. సమావేశం తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్త పేరును ప్రకటించే అవకాశం వుంది. కోటంరెడ్డి ఇష్యూపై మంత్రి కాకాణి గోవర్ధన్‌తో బాలినేని సమావేశం అయ్యారు. ఫోన్…
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు.
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న…
ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్…
జగన్ ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఈ చర్యకు పాల్పడి, జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైపీపీ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు.. జగన్‌తో సమానమైన మంత్రి పెద్దిరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తన మూడేళ్ళ పాలనతో జగన్ ఎంతమంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారో, ఎందరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో చెప్పాలని నిలదీశారు. ఫోన్ల…