Raghunandan Rao: అప్పుడే చెప్పా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. కానీ మా మీదే కేసు పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: దుబ్బాక ఎన్నికలప్పుడు చెప్పా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కానీ.. మా మీదే కేసు పెట్టారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ లో పూజారి హత్య జరిగినప్పుడు హిందువునని గుర్తుకు రాలేదా? ఆ కుటుంబాన్ని పరామార్శించినవా? అంటూ ప్రశ్నించారు. భైంసా లో సంక్రాంతికి హిందువుల పై దాడులు జరిగితే మీ మామ ఎందుకు పోలేదు? అని మండిపడ్డారు. హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనప్పుడు ఏమైంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Vistara Pilot Shortage : నేడు 70 విస్తారా విమానాలు రద్దు… నిన్నటి నుండి 160 విమానాలు లేటు
Also Read
పరీక్షల్లో ఎంట్రీ టైమ్ లో ఆడపిల్లల మెడమీద తాళి బొట్టు తీసేసినప్పుడు మీలో హిందువు ఏమైండు? అని ప్రశ్నించారు. చెంగిచర్ల లో జరిగిన ఘటనలో బాధితుల దగ్గరకు వెళ్ళినవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం దాతల పోన్ లు కూడా టాప్ చేసి .. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజి ఉంటారు… దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదన్నారు. హిందుత్వకు వ్యతిరేకంగా పనిచేసి… ఇప్పుడు హనుమాన్ చాలీసా వచ్చు … అని నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి తెర లేపకన్నారు. మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుట్ట ఎక్కిన మిమ్మల్ని ప్రజలు నమ్మరన్నారు.
Read also: Tamilisai: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..
మా పోన్ లు టాప్ అవుతున్నాయిని దుబ్బాక ఎన్నికల టైమ్ లోనే చెప్పానన్నారు. రాధాకిషన్ ఇప్పుడు ట్యాప్ చేశామని ఒప్పుకున్నాడని అన్నారు. అందులో దుర్మార్గంగా మా మీద కేసు పెట్టారన్నారు. వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లు ఇప్పుడు అధికార పార్టీ లో ఉన్నారు… మీరు శిక్షించే స్థానంలో ఉన్నారని తెలిపారు. 2015 లో రేవంత్ రెడ్డి పోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టీ ఆ తర్వాత జరిగిన పోన్ ట్యాపింగ్ ల పై విచారణ అంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డీ పోన్ ట్యాప్ చేసినప్పుడు ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివదర్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
Read also: Pushpa 2 The Rule: మాస్ జాతర మొదలైంది.. ‘పుష్ప’ దిగుతున్నాడు!
2014 జూన్ 2 నుండి జరిగిన పోన్ ట్యాపింగ్ ల పై విచారణ జరపాలన్నారు. సుమతి రెడ్డి ప్రస్తుత ఎస్ఐబీ చీఫ్ కి పోన్ చేసి సీఎం కేసీఆర్ చెప్పినట్టు నేను పని చేసిన అని ప్రభాకర్ రావు చెప్పాడన్నారు. అప్పటి సీఎం, అప్పటి డీజీపిలను ఎందుకు ముద్దాయిగా చేర్చడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం లేక పోతే కేసీఆర్ ను ఎందుకు చేర్చడం లేదు? అని అన్నారు. మొదటి ముద్దాయి కేసీఆర్, హరీష్ రావు, వెంకట్ రామ్ రెడ్డి, నవీన్ రావు, సందీప్ రావు లు ను వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు.
Pushpa 2 The Rule: మాస్ జాతర మొదలైంది.. ‘పుష్ప’ దిగుతున్నాడు!
తాజావార్తలు
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?