KTR : కేసీఆర్ సిట్‌కు పూర్తిగా సహకరించారు
- 8+8 గుండు సున్నా అనేది కాంగ్రెస్, బీజేపీకి తెలుసు
- వీళ్ల అసమర్థతను డైవర్ట్ చేయడానికే కేసీఆర్‌ను విచారణకు పిలిచారు
- డైవర్షన్, సబ్ డైవర్షన్, పర్వర్షన్, ఇదీ కాంగ్రెస్ పాలన
- ఫోకస్ మళ్లించడానికే ఆదివారం విచారించారు
- సిట్ అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను వేధించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే, భయపడకుండా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. “నిజానికి కేసీఆర్ గారి వయసు, ఆయన హోదా దృష్ట్యా నివాసం నుండే విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. కోర్టును ఆశ్రయిస్తే ఈ విషయం తేలిపోయేది. కానీ, చట్టంపై ఉన్న గౌరవంతో ఆయన స్వయంగా వచ్చి 5 గంటల పాటు అధికారులకు సహకరించారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విచారణతో అధికారులకు కూడా ఎలాంటి తప్పు జరగలేదని అర్థమై ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ విచారణను తెరపైకి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు బడ్జెట్‌లో దక్కింది ‘గుండు సున్నా’ అని ఎద్దేవా చేశారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణించినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.
సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు కనీస ఏర్పాట్లు లేక మంత్రుల కార్లపై దాడులు జరుగుతున్నా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో విహరిస్తున్నారని విమర్శించారు. విచారణ పేరుతో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ‘లీకులు’ ఇస్తోందని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి తప్పుడు లీకులను నమ్మవద్దని కోరారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!