MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను…
PFI:నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధాలున్నాయంటూ 2022లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది.
Gangster: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. 2016లో బెంగళూర్‌లో ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్‌ని హత్య చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత నియాజీ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఇతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో పట్టుబడటం ఎన్ఐఏకి గొప్ప…
Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
NIA: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఇదిలా ఉంటే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు, కీలక నేతలపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు చెందిన ముగ్గురి…
కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు.
Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.