Perni Nani: రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు..
- కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ..
- జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు..
- రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు.. గత జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రచారం చేశారు.. కలెక్టర్ కార్యాలయాలు కూడా తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారని నానా యాగీ చేశారు.. ఇప్పుడు, చంద్రబాబును జాకీలు పెట్టి లేపారు.. ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా చంద్రబాబు పాఠాలు చెబుతారని చెప్పారు.. చంద్రబాబును సీఎంని చేస్తే ఆయన సంపద సృష్టిస్తారు.. జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని డబ్బాలు కొట్టారు.. ఆయనకు వత్తాసు పలికే పవన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేశారు.. ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు అని పేర్ని నాని తెలిపారు.
Read Also: India-Pak War: యుద్ధం వస్తే, భారత్-పాకిస్తాన్ బలాబలాలు ఏంత..? ఏ దేశం ఎటువైపు ఉంటుంది..?
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ఇక, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని వైసీపీ నేత పేర్నినాని తెలిపారు. మంత్రిగా ఎవరున్నా పద్దతి ప్రకారం అప్పులు తీసుకుంటారు.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత బరితెగించి అప్పులు చేయటం లేదు.. బిల్డపు బాబాయ్ చంద్రబాబు, చిన్న బిల్డప్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎన్నో కథలు చెప్పారు.. అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని చెప్తారు.. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు.. తగుదునమ్మా అన్నట్లుగా మరో 44 వేల ఎకరాలు భూములు తీసుకుంటున్నారు.. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో ఓట్లు వేయించుకుని మీ సంపద పెంచుకుంటున్నారు.. ఇవాళ చూస్తే చంద్రబాబు ఆస్తులు పెరిగాయి.. స్పెషల్ ఫ్లైట్ తిరుగుతున్నారు.. డిప్యూటీ సీఎం విమానాలు, హెలిక్రాఫ్టర్లలో తిరుగుతున్నారంటూ పేర్నినాని మండిపడ్డారు.
Read Also: Deputy CM Pawan: మోడీ, చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుంది..
ఇక, జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు 3.32 లక్షల కోట్లు అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం సరాసరి అప్పులు 1.03 లక్షల కోట్లు చేసిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు 40 వేల కోట్లు.. జగన్ తెచ్చిన అప్పుల్లో 2.70 లక్షల కోట్లు డీబీటీల ద్వారా ప్రజలకు ఇచ్చారు.. జగన్ చేసిన అప్పులకు లెక్కుంది.. ఏడాది కూడా తిరక్కముందే 1.47 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు అని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు వాళ్ల అబ్బాయి లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు.. హామీలు అడిగితే భయం వేస్తుంది అని చెబుతారు.. ఇప్పుడేమో చెవిలో చెప్పాలి అంటున్నారు.. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేయటం కోసం జీవో కూడా విడుదల చేస్తున్నారని పేర్నినాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి