తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్. వేసవి సెలవులు పూర్తవడంతో స్కూళ్లు పునఃప్రారంభం. పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు.
విజయవాడ: నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు. ఛాతీ నొప్పి సహా అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చేరిన పీఎస్సార్. నిన్న వైద్యం చేయించుకోవడానికి పీఎస్సార్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన జిల్లా కోర్టు.
నేడు మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు కిట్టు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తమ వాదన వినే అవకాశం ఇవ్వటం లేదని పేర్ని పిటిషన్. రెవెన్యూ, పోలీస్ శాఖల చర్యలు నిలువరించాలని పిటిషన్. నేడు విచారణ చేయనున్న హైకోర్టు కోర్టు.
అమరావతి: లిక్కర్ కేసులో కీలక పరిమాణం. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయాలని కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు. ఈ నెల 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల.
సూపర్ సిక్స్‌లో మరో హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి అమల్లోకి ‘తల్లికి వందనం’ పథకం. ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి. నేడు ‘తల్లికి వందనం’ నిధులు విడుదల. నేడు 67 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ.
విజయవాడ: నేడు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్‌లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం. ‘సుపరిపాలన స్వర్ణాంధ్ర’ పేరుతో సభకు ఏర్పాట్లు. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,210 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,410 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,18,900 లుగా ఉంది.
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. యోగాడే వేడుకలపై సమీక్షించనున్న సీఎం. పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థలతో ఎంవోయూలు.