మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని..
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు.
సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన…
మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు 76 ఏళ్ల ముసలివాడు అంటూ.. పేర్నినాని చేసిన కామెంట్‌పై ఫైర్ అయిన సోమిరెడ్డి.. మాజీ మంత్రి పేర్ని నానికి కొవ్వు ఎక్కువైంది. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని విరుచుకుపడ్డారు.. చంద్రబాబుతో పాటు పేర్ని నాని రామతీర్థం, అలిపిరి మెట్లు ఎక్కగలరా..? అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు…
Kollu Ravindra: నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు.
పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పామర్రు పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ చేరుకున్నారు. మచిలీపట్నం లేదా పామర్రు పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదు చేయనున్నారు.
Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు.…
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?…