ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
వన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తి గత గొడవలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ రోజు ఎన్టీవీలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు సంధించి ప్రశ్నలకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు.
విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి విదితమేయ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు.