Perni Nani: పెన్షన్ల పంపిణీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. అసలు టీడీపీ హయాంలో 1వ తేదీన ఎప్పుడైనా పెన్షన్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. టీడీపీ, చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉదయం నుంచి టిడిపి నేతలు, అభ్యర్థులు సచివాలయంల వద్దకు పరిగేడుతున్నారు.. అయిదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంల దగ్గరికి ఒక్కసారి పోలేదు.. ఇప్పుడు పెన్షన్నర్ల మీద టిడిపి లేని ప్రేమ చూపిస్తుందన్నారు. అసలు పెన్షన్ లు ఆపింది ఎవడు ? అని దుయ్యబట్టారు.
వాలంటీర్లు వద్దని పురంధేశ్వరితో ఈసీకి లెటర్ టీడీపీ పెట్టించిందని విమర్శించారు పేర్నినాని.. యెల్లో వాచ్ అనే సంస్థ వాలంటరీల వ్యవస్థ మీద కోర్టులకు వెళ్తారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రతి పథకాలను పంచి పెట్టారు.. చివరకు పసుపు కుంకుమతో సహా మేం ఎప్పుడు అయినా ఏ పథకంను అయినా ఆపామా? అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ ఎప్పుడు అయిన పిటిషన్ వేసమా ? పసుపు కుంకుమ ఆపమని అని నిలదీశారు. పేదవారి పట్ల సానుకూల దృక్పథం ఉన్న నేత జగన్ మత్రమే అని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ.. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నియమించలేదు అన్నారు.. ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగులను ఎవరు పెట్టారు ? అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం డిగ్రీలు పూర్తి చేసుకున్న వారిని 1 లక్ష 60 వేల మందిని జగన్ నియామకం చేశారు.. కూటమి నేతలు వాళ్ల పాపపు నోళ్లతోనే ఇప్పుడు సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని అంటున్నారని మండిపడ్డారు.
ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారా? రెండు నెలలు పెన్షన్ పంపిణీ చూసి ఓట్లు వేస్తారా ? అని ప్రశ్నించారు పేర్నినాని.. మరి మీరు పసుపు కుంకుమ పంపిణీ చేస్తే.. జనం పచ్చడి చేశారు.. అని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు అల్జీమర్స్ .. నాయకుడిని మార్చుకోండి అని టీడీపీకి సలహా ఇచ్చారు. సచివాలయంకు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి వృద్ధలకు ఉంటుందా ? చంద్రబాబు అని నిలదీశారు. పెన్షన్ ల కోసం వృద్ధులు సచివాలయంల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.. చంద్రబాబు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారు అని దుయ్యబట్టారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు 15 లక్షల పెన్షన్ లు తొలగించారు.. వాలంటరీ వ్యవస్థ మీద విషం మాటలు మాట్లాడారు.. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు.. వాలంటరీ వ్యవస్థ మీద మీకు ఎందుకు భయం చంద్రబాబు? అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.