Perni Nani: మచిలీపట్నం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. చంద్రబాబు పెద్ద బొంకు మాటల నాయుడులా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఇక, శిరోముండనం ఘటన 1995లో తోట త్రిమూర్తులు టీడీపీలో ఉన్నప్పుడు జరిగింది.. 25 ఏళ్లు త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు.. చాలా ఎన్నికల్లో చంద్రబాబు సీటు కూడా ఇచ్చారు.. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు.
Read Also: Summer: వేసవిలో తాటిముంజెలతో ఎన్ని లాభాలో..
ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను నేనెప్పుడూ బూతులు తిట్టానో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. మీ తీరును ప్రశ్నిస్తే బూతులు తిట్టినట్టా..?సీఎం వైఎస్ జగన్ ను మీరంతా కలిసి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు అని ఫైర్ అయ్యారు. నా కొడుకును దిగజారి మాట్లాడుతున్నారు.. గంజాయి అమ్ముతున్నాడు అంటూ నీచంగా మాట్లాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. నా కొడుకు కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చెయ్యకుండా ప్రజలకు సేవ చేశాడని.. నా కొడుకు విషయంలో చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, బందర్ కి చంద్రబాబు చేసింది శూన్యం.. 2014లో చెప్పిన హామీలే మళ్లీ ఇప్పుడు చెప్తున్నాడు.. చంద్రబాబు మాయ మాటలు నమ్మడానికి బందర్ ప్రజలు అమాయకులు కాదని హెచ్చరించారు.. మరోవైపు.. తన హయాంలో బందర్‌లో చేసిన అభివృద్ధి పనులను మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.