రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన జాతి పిత మహాత్మాగాంధీ అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిపాలన అందించిన లాల్ బహుదూర్ శాస్త్రి, ఇద్దరికి కాంగ్రెస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు, జగన్ పరిపాలన చూస్తున్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగ విలువలను వదిలి పాలిస్తున్న తీరు చూస్తున్నాం.. మనిషికి భద్రత కరువైపోయింది,ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Pawan: గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారు
దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.. భారత్ జోడో యాత్ర కూడా అందులో భాగమేనని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అనేక విభజన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. 2014 అధికారంలోకి వచ్చి ఉంటే హామీలను అమలు చేసేది.. 3 వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయక సన్నిధి నుంచి ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం అని రుద్రరాజు ప్రకటించారు.
Read Also: Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
4వ తేదీ చిత్తూరులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. 5వ తేదీ మదనపల్లెలో,6 వ తేదీ కడపలో సభలు నిర్వహిస్తున్నాం.. వైద్య విద్య లో జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలలో అవకతవకలు జరుగుతున్నాయి.. దీని వల్ల అర్హులైన అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు అంటూ రుద్రరాజు ఆరోపించారు. ప్రజా పోరాటాలకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు.