డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కోవాలి.. పోలీసులు ప్రజలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పుకొచ్చారు. ఫిర్యాదు వచ్చిన మరుక్షణం సీరియస్ గా స్పందించాలి అని డీజీపీ తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్ర నాథ్ హెచ్చరించారు.
Read Also: Hijab: కర్ణాటకలో హిజాబ్ వివాదం.. విద్యార్థినులు ధరించేందుకు అనుమతి..
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ పేర్కొన్నారు. ఏపీలో 24 లక్షల మంది మహిళలు దిశా యాప్ ఉపయోగిస్తున్నారు.. సోషల్ మీడియా అసత్య ప్రచారం పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను పోలీసులు ఇవ్వాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి హెచ్చరించారు.