మైనార్టీల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా అందరం కలిసిమెలిసి ఉన్నాము.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ని గాంధీభవన్ లో కూర్చొబేట్టారు.. గాంధీ భవన్ లో గాడ్సే ను కూర్చోబెట్టారు.. తెలంగాణను డిస్ట్రబ్ చేయడమే ప్రతిపక్షాల పని అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర అత్యధికంగా మైనార్టీలకు బడ్జెట్ కేటాయించాము అని మంత్రి వెల్లడించారు. మైనార్టీ వెల్ఫెయిర్ కోసం ఎంతో ఖర్చుచేస్తున్నాము.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగా-జమున తహజీబ్ కనిపిస్తుంది.. తెలంగాణలో సెక్యులరిజం ఉన్నది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read also: Manish Sisodia: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణపై ఆప్ రివ్యూ పిటిషన్!
అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ సమానంగా చూస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చాక ఒక్కరోజు కూడా కర్ఫ్య్ పెట్టె పరిస్థితి రాలేదు అందరం కలిసి మెలిసి ఉంటున్నాము.. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అంటుంది ఎన్నో అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తమ ఓట్ల కోసమే ప్రజల్ని వాడుకుంటుంది.. ఆర్ఎస్ ఎస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటుంది అని ఆయన తెలిపారు. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది.. 25 కోట్ల మంది ముస్లింలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారు.. హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టేవాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలి.. ఈ ముప్పై రోజులు ప్రజల్లోకి వెళ్ళండి కాంగ్రెస్-బీజేపీ కుట్రలను ప్రజలకు చెప్పండి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.