టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు. ఇప్పటివరకు యూజీ మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడినా.. ట్రోఫీ మాత్రం అందుకోలేదు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నా.. ఐపీఎల్ టైటిల్ మాత్రం చహల్ ఖాతాలో లేదు. దాంతో మూడు ఫైనల్స్ ఆడినా.. కప్ గెలవని తొలి ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. Also…
IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముగింపు వేడుకలు ఈ రోజు (జూన్ 3న) సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతుంది.
ఐపీఎల్ ఫైనల్……. ఇంకా కొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. మొదటి క్వాలిఫయర్ లో గెలిచి ఆర్సీబీ ఫైనల్ ల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దే కీలక పాత్ర. మ్యాచ్ ఓటమి అంచున ఉండగా, అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ముంబైకి చుక్కలు చూపించాడు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అయ్యర్…
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్- 2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య ప్రశంసించాడు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరుగులు చేశాడన్నాడు. తమ బ్యాటర్లు మంచి స్కోరే చేశారని, బౌలింగ్ యూనిట్ రాణించలేకపోయిందన్నాడు. తమ బౌలర్లు సరైన లెంగ్త్ బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సరైన సమయాల్లో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించుకోలేకపోయాం అని హార్దిక్ తెలిపాడు. క్వాలిఫయర్-…
ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసి.. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో శ్రేయస్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరింది. ఈ ఘనత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వల్ల కూడా కాలే. అయితే ఈ ఇద్దరు…
భారీ మ్యాచులంటే తనకు చాలా ఇష్టం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్‌గా ఉండటం వెనుక కారణం ఏమీ లేదని చెప్పాడు. నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని తన జట్టు సహచరులకు ఎప్పుడూ చెబుతుంటా అని పేరొకొన్నాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్..…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని, పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారన్నాడు. తాము తక్కువ స్కోర్ లక్ష్యంగా విధించామని, బౌలర్లను ఏమాత్రం నిందించలేం అని చెప్పాడు. మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలన్నాడు. ఇది మర్చిపోలేని రోజు అని శ్రేయాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్‌లో ఆర్‌సీబీకి ఎక్కడా కూడా పంజాబ్…
RCB's IPL Playoff Record: ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ అభిమానుల నుంచి ఎక్కువగా వినిపించే మాట.. ‘ఈసాలా కప్ నమదే’.. కానీ ఆ జట్టు కల ఈ సారి నెరవెరే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2025కు ముందు జట్టులో భారీ మార్పులు చేసిన బెంగళూరు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా తయారైంది.
బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తన కో-ఓనర్ (సహ యజమానుల)లపై కోర్టులో కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ.. పంజాబ్ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. డైరెక్టర్‌గా మునీశ్ ఖన్నా నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ వ్యవహారంతో పంజాబ్ కింగ్స్ జట్టులోని లుకలుకలు బయటపడ్డాయి.…