భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడం, భారత్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉందాంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశానికి పయనమయ్యారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. రికీ విమానం కూడా ఎక్కేశాడు. అయితే విమానం ఎక్కాక భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటన వెలువడటంతో.. వెంటనే అతడు తన…
చేతి వేలి గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది. మిచెల్‌ను రూ.3 కోట్లకు పంజాబ్ తీసుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025లో మిచెల్ ఆడుతుండడం విశేషం. మే 9 వరకు పీఎస్‌ఎల్ 2025లో మిచెల్…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరు గుర్తు పెట్టుకోవడంతో షాక్‌కు గురయ్యా అని పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు నేహాల్ వధేరా తెలిపాడు. విరాట్ తన షాట్ సెలక్షన్‌ను ఎంతో మెచ్చుకున్నాడని, కోహ్లీ భాయ్‌తో మాట్లాడడంతో ఆట పట్ల తన దృక్పథం మారిందన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ గెలిచిన తర్వాత తానెంతో ఆరాధించే యువరాజ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని నేహాల్ వధేరా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో రాణిస్తున్న నేహాల్ 7 మ్యాచ్‌ల్లో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులను కాపాడుకుని.. 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. మరోవైపు అత్యధిక స్కోర్ (262)ను ఛేదించిన టీమ్‌గా ఇప్పటికే పంజాబ్ రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కోల్‌కతాపైనే…
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు తీవ్రమైన తొడ నొప్పితో మైదానాన్ని వీడాడు. ఫిజియోతో కలిసి మైదానాన్ని వీడిన ఫెర్గూసన్.. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. ఫెర్గూసన్ లేని లోటు ఆ మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపింది.…
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా…
టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ భారత జట్టు తరఫున ఆడి రెండేళ్లు గడుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 స్క్వాడ్‌లో ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చోటే లేదు. ఏమాత్రం నిరాశ చెందని ఈ మణికట్టు స్పిన్నర్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యూజీ.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కప్ కొట్టని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ముద్దాడలేదు. ఆరంభ సీజన్‌లో సెమీస్ చేరిన పంజాబ్.. 2014లో ఫైనల్ చేరి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ప్రదర్శనలు మినహాయిస్తే.. మరోసారి కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ప్రాంచైజీ పేరు మార్చినా, వేర్వేరు కెప్టెన్లను ప్రయత్నించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇటీవలి సీజన్లలో పేలవ ప్రదర్శన కారణంగా.. సగటు అభిమానికి ప్లేఆఫ్స్…
ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. నవంబర్ 4తో ఆటగాళ్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది ప్లేయర్స్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాకు గడువు ముగియగా.. 10 ప్రాంఛైజీలు తమ లిస్ట్ ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాల…
ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) పోటీపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది.