RCB’s IPL Playoff Record: ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ అభిమానుల నుంచి ఎక్కువగా వినిపించే మాట.. ‘ఈసాలా కప్ నమదే’.. కానీ ఆ జట్టు కల ఈ సారి నెరవెరే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2025కు ముందు జట్టులో భారీ మార్పులు చేసిన బెంగళూరు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా తయారైంది. లీగ్ ఆరంభం నుంచే ఆయా జట్లకు షాకిస్తూ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2లోకి దూసుకెళ్లింది. 9 ఏళ్ల తర్వాత బెంగళూరు క్వాలిఫయర్-1కు వెళ్లింది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి బలంగా కనిపిస్తోన్న ఈ జట్టు టైటిల్‌ను చేరుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉంది. ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలుండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం అని చెప్పాలి. మరి ఇప్పటి వరకు బెంగళూరు ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.. ఎలాంటి ఆటను చూద్దాం..
Read Also: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్
అయితే, తొలి నాలుగు సీజన్లలో ఏకంగా మూడు సార్లు ప్లేఆఫ్‌కు వెళ్లిన ఆర్సీబీ.. మూడేళ్ల వ్యవధిలో రెండుసార్లు త్రుటిలో కప్ ను కోల్పోయింది. అప్పట్లో సీఎస్కే తర్వాత అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు బెంగళూరే. తొలి సీజన్‌లో ఏడో ప్లేస్ లో నిలిచిన ఆ తర్వాతి సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా ఫైనల్‌కు చేరింది. సెమీస్ లో చెన్నైని 6 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లిన టైటిల్ పోరులో హైదరాబాద్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. అనంతరం 2010లోనూ మంచి ప్రదర్శనతో సెమీస్‌కు చేరగా.. ఈసారి ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. అలాగే, 2011లో క్రిస్ గేల్ విధ్వంసంతో వరుసగా ఏడు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
Read Also: NTR: నందమూరి తారకరామారావు ఒక అవతార పురుషుడు : మోహనకృష్ణ
ఇక, ఆ తర్వాత ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో అదరగొట్టిన.. ఫైనల్‌లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. తుది పోరులో 58 రన్స్ తేడాతో ఓడిపోయి.. టైటిల్‌ను కోల్పోయింది. అనంతరం 2012, 2013, 2014 సీజన్లలో బెంగళూరు లీగ్ దశను కూడా దాటలేదు. కానీ, 2015లో మరోసారి అద్భుతంగా ఆడి మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. కానీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ఆర్సీబీని ఓడించింది సీఎస్కే.
Read Also: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్
కాగా, 201లో విరాట్ కోహ్లీ భీకర ఫామ్ కొనసాగించడంతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కానీ, ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో మరోసారి ఓటమిపాలైంది. అయితే, 2017, 18, 19 సీజన్లలో లీగ్ దశకే పరిమితమైన బెంగళూరు.. 2020 నుంచి ఇప్పటి వరకు 2023లో మినహా.. అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అయినా, కూడా బెంగళూరుకు ఒక్కసారి కూడా కప్ ను అందుకునే అవకాశం మాత్రం రావడం లేదు. 2020లో సన్‌రైజర్స్ చేతిలో, 2021లో కోల్‌కతా చేతిలో ఓడిపోయి.. ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లోనే వైదొలిగింది. 2022లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై గెలిచిన ఆర్సీబీ క్వాలిఫయర్-2లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. గత సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన ఆర్సీబీకి.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో మళ్లీ రాజస్థాన్ బిగ్ షాకిచ్చింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంది.
Read Also: Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
అయితే, ఈ సారి అదిరిపోయే ఆటతో టాప్-2లో నిలిచిన ఆర్సీబీ.. టైటిల్‌ను దక్కించుకోవాలనుకుంటే ముందు పంజాబ్ కింగ్స్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెట్టాలి.. క్వాలిఫయర్-1లో ఏదైనా తేడా కొడితే మరో ఛాన్స్ ఉన్నా పరిస్థితి అంత వరకు రాకుండా చూసుకోవడం మంచింది. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతున్న గుజరాత్, ముంబై జట్లను అంత ఈజీగా తీసిపారేయడానికి అవకాశం లేదు.