గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నేడు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ జరగనుంది. ఈ సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. సభకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా 2024 ఎన్నికలకు జనసేన ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే…
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఇప్పటం దగ్గర ఈనెల 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. ఇప్పటం వేదికగా.. పార్టీ కార్యాచరణను ప్రకటించబోతున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, సీఎం వైఎస్ జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ సభగా అభివర్ణించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరగనుంది అని వెల్లడించిన ఆయన.. దామోదరం సంజీవయ్య పేరుతో సభ ప్రాంగణం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కామెంట్ చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అదే, సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు మాకు ముఖ్యం అన్నారు.. సాంకేతికమైన సమస్యలను అధిగమించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన అవంతి.. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని..…
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం పరిధిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం…
సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ సాగుతోంది.. సీఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇక, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నమాట.. ఇక, రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన…
ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనేక ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా మారకముందే వాటిని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఏజెంట్’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది…