వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ ‘భీమ్లా నాయక్’ రివ్యూ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్”మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి థియేటర్లలో “భీమ్లా నాయక్” సందడి చేస్తున్నాడు. మొదటి షో నుంచే సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ విమర్శలు కురిపించే ఆర్జీవీ తాజాగా పవన్ “భీమ్లా నాయక్”…
ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు. Read Also :…
ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. తాజాగా ఈ ఇద్దరు మంత్రులు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే… కృష్ణాజిల్లా, గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో “భీమ్లా నాయక్”ను ప్రదర్శిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు మంత్రులను…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, ఇతర సమస్యలపై సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది… మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్‌స్టార్ మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను కలవడం.. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయాయి.. ఇక, త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు.. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం…
ఏపీలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి చాలా థియేటర్లలో రూల్స్ పేర్లతో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ…
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” ఫీవర్ నడుస్తోంది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నేడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిక్కిరిసిన జనాలతో థియేటర్లలో మొదటి షోకే హౌస్ ఫుల్ బోర్డు పడింది. ఇప్పటికే ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి సినిమాకు సానుకూల స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ మాత్రం మరో వారం వాయిదా పడింది. “భీమ్లా నాయక్” నిర్మాతలు సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ…
ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్లో ప్రదర్శితం అయ్యాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సందడి నడుస్తోంది. మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Read Also…
తెలంగాణ రాజకీయ నేతలపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నేతలు రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరని పవన్ కొనియాడారు. తెలంగాణ నేతలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తారని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని.. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకవైపు బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ భేటీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏ ఈవెంట్‌ను మిస్ చేసుకోరు. అందులో పవన్ కల్యాణ్ అంటే యువతో పాటు అన్ని వయసుల వాళ్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీ రిలీజ్ వేడుక…