జనసేన ఆవిర్భావ సభలో తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్‌గా తాను హీరోనని మంత్రి అవంతి అన్నారు. పవన్‌కు అహంభావం ఎక్కువ అని.. అతడి సినిమాల్లో విజయాల కంటే ఎక్కువ పరాజయాలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకోరా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై…
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది… గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగన జనసేన ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమంటూ స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆయన.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే…
జనసేన పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ…
జనసేన ఆవిర్భావ సభ నేడు మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాలను నుంచి ఇప్పటం గ్రామానికి జనసైనికులు పోటెత్తారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. రాజకీయ దొంగలు.. ప్రజల జీవితాలనే దోచేస్తారని, పిల్లలను.. ఉద్యోగాలను.. భవిష్యత్తుని రాజకీయ దొంగలు దోచుకుంటున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల్ని దోచుకునే రాజకీయ దొంగలను ప్రజలే ఎన్నుకోవడం బాధాకరమన్నారు. డాక్టర్ గారి అబ్బాయితో ఏపీ ఆపరేషన్ చేయించుకుందన్నారు. ఇతర…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమ్నఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి..? ఆరోగ్య శ్రీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు..? అన్నింటికీ కారణం అభివృద్ధి లేకపోవడమే కారణం అన్నారు.. అమర్ రాజా సంస్థ, కియా అనుబంధ పరిశ్రమలు వైసీపీ చేసే గొడవకు వెళ్లిపోయాయని విమర్శించిన ఆయన.. గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేవ్.. టీడీపీ ఐదేళ్ల హయాంలో రూ. 53 వేల కోట్ల మేర మద్యం…
వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంపూర్థ మద్యపాన నిషేదం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీనైనా చితక్కొట్టిస్తాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం.. మరోసారి ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొంటామన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన.. ప్రతిపక్షంలోకి ఉండి అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే రాజధానిని రద్దు చేసిందన్నారు..…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా?…
గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు…
YSRCP Digital Team Counter to Janasena Party Chief Pawan Kalyan. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలోనే జనసేన ఆవిర్భవ…
Janasena Political Affairs Committee Irony జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. మూడేళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత మన సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాజధాని రైతుల అకుంఠిత…