Akira Nandan… పవర్ స్టార్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అకిరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెప్తూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే తాజాగా అకిరా బర్త్ డేని పురస్కరించుకుని రేణూ దేశాయ్ తన తనయుడు అకిరా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అకిరా పవర్ ఫుల్ పంచులు చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే అకిరా చేస్తున్న ఈ ప్రాక్టీస్ అంతా వెండితెర అరంగ్రేటం కోసమేనని ప్రచారం జరుగుతోంది.
Read Also : Sarkaru Vaari Paata : మహేష్ కు మరోసారి మార్వెల్ ముప్పు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం “హరి హర వీర మల్లు”. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదును పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోను, పవన్ తనయుడి బాక్సింగ్ వీడియోను కలగలుపుతూ “హరి హర వీర మల్లు” చిత్రంతో అకిరా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్రలో అకిరా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ పాత్ర కోసం అకీరా శిక్షణ తీసుకుంటున్నాడు. ముందుగా క్రిష్‌కి అకీరా పాత్ర గురించి ఆలోచన రాగా, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొత్తానికి వారసుడి ఎంట్రీ కోసం మంచి ప్లానే వేశారు పవన్, రేణూ!