పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “హరి హర వీర మల్లు”. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదును పెడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తాజాగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం.
Read Also : Happy Sri Rama Navami : ఫ్యాన్స్ కు చిరు విషెస్
పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీరాముడి పటానికి పూజా చేసి, హారతి ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు క్రిష్ తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. “హరి హర వీర మల్లు” సెట్స్ లో జరిగిన శ్రీరామ నవమి ప్రత్యేక పూజకు సంబంధించిన పిక్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేముందు ఈ పూజను నిర్వహించారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా సినిమాలో నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. “ఈ పవిత్రమైన శ్రీరామనవమిని శౌర్యానికి, పుణ్యానికి ప్రతీకగా జరుపుకుందాం” అంటూ మేకర్స్ ఈ పోస్టర్ ను రివీల్ చేశారు.