ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
ఇటీవల జరిగిన కింగ్డమ్ సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ గురించి నాగవంశీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా ? అని అడిగితే మా పవన్ కళ్యాణ్ విజయే అని అన్నారు. అయితే అది వివాదంగా మారడంతో తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ విషయాలను కాంట్రవర్సీ చేసే సోకాల్డ్ జీనియస్ లకి చెబుతున్నాను. ఎప్పుడైనా ఒకరిని పొగడాలి అనుకోండి, హృతిక్ రోషన్ లాగా ఉన్నారు అంటారు కదా. Also…
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ అభిమానులలో అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పవర్ఫుల్ సాంగ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ ని విడుదల చేశారు మేకర్స్.…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్లో పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారు?. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో,…
2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. జనాలకు అండగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గిరిజనులపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను సందర్శించిన జనసేనాని.. అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు పంపి మంచి మనసు చాటుకున్నారు.…
Kingdom : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్ మెరిసింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్న కింగ్ డమ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా…