OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అంటే నెల ముందే ఓపెనింగ్స్ చేసి భారీ ఎత్తున టికెట్లు సేల్ చేయాలని టార్గెట్ గాపెట్టుకున్నారు మూవీ టీమ్.
Read Also : Prabhas : ప్రభాస్ కు లైన్ క్లియర్.. రేపటి నుంచి అక్కడ షూటింగ్..
సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఉత్తర అమెరికాలో ఎంత లేదన్నా 2 మిలియన్ల టికెట్లు అమ్ముడు పోయేలా చేయాలన్నది అసలు ప్లాన్. అందులో భాగంగానే అమెరికాలో ఈ స్థాయిలో బుకింగ్స్ కు ప్లాన్ చేశారన్నమాట. ఓజీ మీద భారీ హైప్ ఉంది. ఇక ట్రైలర్ వస్తే అంచనాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాకు కొంచెం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదు. ఈ సినిమాతో ఎలాగైనా రూ.200 కోట్ల మార్కును అందుకోవాలని చూస్తున్నాడంట పవన్ కల్యాణ్.
Read Also : Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..