పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Sundarakanda : సుందరకాండ.. ఇన్ సైడ్ టాక్ చాలా బాగుందట?
కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో మాకంటే మాకు అని పోటీ పడి మరి కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రాలో రాజకీయ పార్టీలకు చెందిన ఓ ఎంపీ OG రైట్స్ ను కొనుగోలు చేసారంటే అర్ధం చేసుకోండి పవర్ స్టార్ సినిమా క్రేజ్ ఎలా ఉందొ. ఇక నైజాంలోను ఓజి కోసం పోటీ ఎక్కువగానే ఉంది. అనేక బేరసారాల అనంతరం రూ. 46కోట్లకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి OG నైజాం రైట్స్ వెళ్లాయి. వచ్చే నెల 25న OG రిలీజ్ కాబోతుంది. పోటీగా వస్తుందనుకున్న బాలయ్య – బోయపాటిల అఖండ 2 డిసెంబరుకి వెళ్ళింది. దాంతో పవర్ స్టార్ సినిమాకు సోలో రిలీజ్ దొరకడంతో నైజాంలో సింగిల్ స్క్రీన్స్ మొత్తం ఓజి వేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. నైజాంలో ఓజి ఓపెనింగ్స్ భారీ నెంబర్ కనిపించే అవకాశం ఉంది.