పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 25న OG వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఇప్పటీకే అఫీషియాల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసారు. కాగా ఓవర్సీస్ లో ఈ సినిమా హంగామా కాస్త ముందుగానే స్టార్ట్ అవబోతుంది. సెప్టెంబర్ రిలీజ్ కానున్న సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ నెల 29 నుండి స్టార్ట్ చేయబోతున్నారు. అసలే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో OGని ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవర్సీస్ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సిచుయేషన్ చూస్తుంటే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో పవర్స్ స్టార్ గత సినిమాలు తాలుకు రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉంది OG. ప్రీమియర్స్ నాటికి ఎన్ని మిలియన్స్ రాబడతాడో చూడాలి.