Minister Nadendla: ఈ నెల 30వ తేదీన విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15 వేల మంది ఆహ్వానితులు వస్తుండగా.. పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యచరణ కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఇందిరా ప్రయదర్శినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్లతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.
Read Also: Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన విధానం ప్రకటించాలన్న వైసీపీ డిమాండ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటీకరణ అనేది జరగదని ఇప్పటికే స్పష్టం చేశాం.. రాజకీయ లబ్ది కోసం వైసీపీ చేస్తున్న చౌకబారు వ్యవహారంగా తేల్చేశారు. స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిస్తే.. ఇక్కడ వైసీపీ పాదయాత్ర పేరుతో షో చేసిందని విమర్శించారు. విశాఖ వేదికగా సేనతో సేనాని పేరుతో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాలను ప్రతిష్టాత్మకంగా జనసేన తీసుకుంది.