Pawan Kalyan about bheemla nayak and vakeel saab losses: పవర్ స్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడుతూ తన సినిమాల నష్టం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తన సినిమాలకు ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తావించారు. తనపై కక్షకట్టి భీమ్లా నాయక్ & వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు టికెట్స్ ధరలు తగ్గించారని, టికెట్ ధర పది…
Pawan Kalyan: అభిమానం.. అది ఒక్కసారి మనసులో చేరితే ఎక్కడ వరకు అయినా తీసుకెళ్తోంది. చివరికి అభిమానించిన వ్యక్తి చెప్పినా కూడా వారి పిచ్చిని ఆపడం కష్టం. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అది అభిమానం కాదు భక్తి. వారు అభిమానులు కాదు భక్తులు అని చెప్పొచ్చు.
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు..
హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.
ముద్రగడ లేఖను పవన్ కల్యాణ్ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.
సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు