Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. నిన్న ఒక మాస్ పోస్టర్ ను రిలీజ్ చేసి టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. నేడు టైమ్, డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 29 సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Kamal Haasan: ఇండియన్ 2.. సినిమా హిట్ అవ్వకముందే శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన కమల్
పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉండడంతో.. టీజర్ కు డబ్బింగ్ చెప్పడం కాస్త లేట్ అయ్యింది. పవన్ అస్వస్థతగా ఉన్నా కూడా బ్రో టీజర్ కు డబ్బింగ్ చెప్పి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఇక ఈ టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ టీజర్ లో పవన్ నాలుగు గెటప్ ల్లో దర్శనమివ్వనున్నాడట.. అందులో ఒకటి ఆల్రెడీ మేకర్స్ రిలీజ్ చేశారు. రైల్వే కూలీ గెటప్ లో పవన్ తమ్ముడు వింటేజ్ లుక్ ను దింపేశాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. మరి రేపు టీజర్ తో బ్రో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియాల్సి ఉంది.