YS Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల సందర్భంగా కురుపాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయనమాట్లాడుతూ.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు.. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు.. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారు.. ఇక, మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు.. మంచి చేయొద్దు అన్నదే వారి విధానం అంటూ ఫైర్ అయ్యారు…
Read Also: IND vs IRE Schedule 2023: ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్ ఇదే!
ఇక, పవన్ కల్యాణ్‌పై గట్టిగా ట్రోలింగ్ చేశారు సీఎం జగన్.. దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు ఆ దత్తపుత్రుడు అని నిలదీశారు సీఎం జగన్.. ఇప్పుడు ఆ ప్యాకేజీ స్టార్.. ఓ లారీ ఎక్కాడు.. దారి పేరు వారాహి అట.. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతాను అంటాడు.. ఈ మనిషి నోటికి అదుపులేదు.. ఈ మనిషికి నిలకడా లేదు అని ఎద్దేవా చేశారు.. వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.