Sajjala Ramakrishnudu: 175కి 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలి.. టెలి కాన్ఫరెన్స్‌లో సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy Tele Conference Meeting With Party Observers: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు సూచించారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ పరిశీలకులు కీలకంగా వ్యవహరించాలని.. వారంలో కనీసం రెండు రోజులు నియోజకవర్గాల్లో ఉండి పని చేయాలని అన్నారు. పార్టీ పరిశీలకులపై సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉన్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు సంధానకర్తలుగా పని చేయాలని చెప్పారు. జగనన్న సురక్ష, ఓటర్ల జాబితా సవరణ, దొంగ ఓట్లు తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలలో నెలకొనే సమస్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాల విషయాలలో అధిష్టానం తరపున సమన్వయం చేయాలన్నారు. 175 నియోజకర్గాలకు 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలన్నారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని.. వాటిని వెంటనే గుర్తించి తొలగించాలని దిశానిర్దేశం చేశారు.
Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అంతకుముందు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై సజ్జల ధ్వజమెత్తారు. పవన్ అసలు రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. సినిమా నటుడు కాబట్టే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చదువుతాడని ఎద్దేవా చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ అంటున్నారని, అక్కడే ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పవన్‌తో పాటు ఇతర నాయకులందరికీ.. రాజకీయ అజెండా మొత్తం చంద్రబాబు, ఎల్లో మీడియా వద్దే రెడీ అవుతుందన్నారు. దాన్ని మోయడమే వారి పని అని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా.. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడుపడదని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడే.. పవన్ దివాళాకోరుతనం అర్థమైపోయిందని విరుచుకుపడ్డారు.
Bihar: పెళ్లి వేడుకలో మైక్ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..