Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. Also…
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా... ఫీల్డ్లో ఫ్రంట్ లైన్లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో... వైసీపీ అటాకింగ్ మోడ్లోకి వెళ్తోంది.
కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే అనంతపురం సభ ఏర్పాటు జరిగిందా...కూటమి నేతల్లో పై స్థాయిలో...సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా...తాజా పరిణామాలు చూస్తే ఇలాగే ఉన్నాయి....కూటమి ఐక్యత కొనసాగిస్తూ....ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండా గా సభ జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అసెంబ్లీకి రాకుండా 'రప్పా.. రప్పా..' అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు..