మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ఉండగా, చివరి నిమిషం వరకు కంటెంట్ డెలివరీ చేయలేకపోయాడు సుజిత్. డి.ఐ. సహా పలు కారణాలు చెబుతూ ఈ కంటెంట్ లేట్ చేశారు. అయితే, అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, ప్రత్యంగిరా యు.ఎస్. అనే సంస్థ ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది.
Also Read:Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
ఈ నేపథ్యంలో, పవన్ అభిమానులను కంటెంట్ డెలివరీ బాయ్స్‌గా మార్చి, ఒక్కొక్కరికి హార్డ్ డిస్క్‌లు ఇచ్చి, విమాన టికెట్లు బుక్ చేయించి, నార్త్ అమెరికాలో ఉన్న థియేటర్లన్నింటికీ పంపించారు. అలా, ఈ రోజు ప్రీమియర్స్ పడవేమో అనుకున్న చోట్లకు కూడా ఈ హార్డ్ డిస్కులు చేరాయి. ఫైనల్‌గా, నార్త్ అమెరికాలో దాదాపు అన్ని లొకేషన్స్‌లో ఈ ప్రీమియర్స్ ఇప్పుడు పడబోతున్నాయి. ఈ మొత్తానికి కారణం పవన్ అభిమానులు డెలివరీ బాయ్స్‌గా మారి కంటెంట్ డెలివరీ చేయడమే అని తెలుస్తోంది.