దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్‌ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ డబ్బింగ్ ఫిల్మ్స్ ఇడ్లీ కడాయ్, కాంతార చాప్టర్ వన్. ధనుషస్ ఇడ్లీ కడాయ్‌ని ఇడ్లీ కొట్టుగా అక్టోబర్ 1న తెస్తుంటే.. రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాలకు వాళ్లే హీరోలు.. వాళ్లే దర్శకులు.
Also Read:OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..
ఇక దీపావళికి కాంపిటీషన్ మామూలుగా లేదు. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తుంటే.. కే ర్యాంప్ అంటూ దూసుకొస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఇద్దరు ఒక్క రోజు గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన తెలుసుకదా అక్టోబర్ 17న, జైన్స్ నాని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న కే ర్యాంప్.. అక్టోబర్ 18న థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Also Read:Rashmika Mandanna: ప్లాప్ వచ్చినా రష్మికను నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా..?
సిద్దు, కిరణ్ అబ్బవరం కన్నా ముందే సీనియర్ యాక్టర్, దాదా ఫాల్కే అవార్డ్ గ్రహీత మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. బై లింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న వృషభ అక్టోబర్ 16నే రిలీజ్ కాబోతోంది. ఇవే కాకుండా మరో డబ్బింగ్ ఫిల్మ్ డ్యూడ్ అక్టోబర్ 17న రిలీజ్ కాబోతుంది. ప్లాపే చూడని హీరో ప్రదీప్ రంగనాథన్‌తో హిట్టే చూడని స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్ బైసన్‌తో అదే రోజు టగ్ ఆఫ్ వార్‌కు దిగుతున్నాడు.