తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా.. జనసేన పార్టీ కూడా సుగాలి ప్రీతి కేసుపై స్పందించింది.. సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో... సాయం పొందిన వారు…
విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను తిలకించారు పవన్.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది" అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan Meets MLAs in Vizag: విశాఖలో జరుగుతున్న ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిదేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి…
Pawan Kalyan : అంతా అనుకున్నట్టే జరిగింది. సెప్టెంబర్ 25 నుంచి బాలకృష్ణ అఖండ-2 తప్పుకుంది. మూవీని వాయిదా వేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ హీరోగా సుజీత డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ రిలీజ్ అవుతోంది. బాలయ్య, పవన్ సినిమాల మధ్య భీకర పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బాలయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. రీ రికార్డింగ్, వీఎఫ్ ఎక్స్ పెండింగ్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే…
టాలీవుడ్ సినిమాకు రెండు తెలుగు స్టేట్స్ తో పాటు సమానంగా వసూళ్లు రాబట్టే ప్లేస్ అంటే ఓవర్సీస్ అనే చెప్పాలి. కొన్ని సినిమాలైతే తెలుగు స్టేట్స్ ని మించి భారీ వసూళ్లు ఓవర్సీస్ లో రాబట్టిన రోజులు ఉన్నాయి. ఇక స్టార్ హీరోలకు ఇండియాన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. నార్త్ అమెరికాలో మిలియన్ వసూళ్లు వస్తుంటాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ కలెక్షన్స్ రాబట్టి మేజర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి.…
వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి…
దసరా సెలవుల సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతోంది. ఈ సుదీర్ఘ సెలవుల కాలంలో పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం సోలో రిలీజ్‌గా రానుంది. గతంలో బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా ఈ పండుగ బరిలో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల డిసెంబర్ 5కు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద అడ్వాంటేజ్ లభించనుంది. Also…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..