Mega Star : డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి : చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలై 47 సంత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా మెగాస్టార్ సినీ జర్నీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజు నా ఆనందానికి అంతులేని ఉత్సాహం కలిగింది, అది మాటల్లో వర్ణించలేనిది కూడా.
Also Read : OG : పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
47 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతి అంశంలోనూ అన్నయ అసాధారణంగా ఎదిగిన తీరు, అయినప్పటికీ అలసిపోని తత్వం, వినయంతో సహాయం చేసే ఆప్యాయమైన స్వభావాన్ని కోల్పోకుండా ఉండటం ఎంతో స్ఫూర్తిదాయకం. దుర్గమ్మ తల్లి ఆయనకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరాల్లో ఆయన మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాలని ఆశిస్తున్నా. ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదు. జన్మతః యోధుడు మన ప్రియమైన పెద్దన్నయ్య, శంకర్ బాబుగా పిలుచుకునే ‘మెగాస్టార్ చిరంజీవి’ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు” అంటూ పవన్ ట్వీట్ చేశారు.
దానికి మెగాస్టార్ చిరంజీవి అంతే ఆప్యాయంగా స్పందించారు. “డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి. నన్ను బిగినింగ్ డేస్‌కి తీసుకెళ్లాయి. ప్రాణం ఖరీదు నుంచి ఇప్పటి వరకు నాకు లభించిన అభిమానుల ప్రేమ, కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. నీకు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓజీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. టీం అందరికీ శుభాకాంక్షలు” అని బదులిచ్చారు మెగాస్టార్ చిరు. ఈ మెగా అన్నదమ్ముల ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dear Kalyan Babu,
Your words touched me deeply and took me back to those early days.
From '𝓹𝓻𝓪𝓷𝓪𝓶 𝓴𝓱𝓪𝓻𝓮𝓮𝓭𝓾' to this day, I have always cherished the love and encouragement of our family, friends, fans, and audience. Thank you very much for everything. May the… https://t.co/VQ7Ut69kNr
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
తాజావార్తలు
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!