Tollywood : ఓవర్సీస్ కంటెంట్ డెలివరి చేయలేక చేతులెత్తేసిన ‘స్టార్’ సినిమా మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా కంటెంట్ డెలివరి చేయలేక కిందా మీదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కంటెంట్ ను రిలీజ్ రోజు కేవలం కొన్ని గంటల ముందు డెలివరి చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ కంటే కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతాయి. అయినప్పటికి చివరి నిమిషంలో చెక్కుతూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మరో తెలుగు బిగ్ బడ్జెట్, భారీ హైప్ ఉన్న సినిమా కంటెంట్‌ను సమయానికి డెలివరీ చేయలేక చేతులెత్తేసింది. ట్రైలర్ ను సరైన టైమ్ లో రిలీజ్ చేయని నిర్మాణ సంస్థ ఓవర్సీస్ కంటెంట్ ను ఇంకా అప్ లోడ్ చేయలేదు. ఫలితం ఓవర్సీస్ లోని కొన్ని థియేటర్స్ లో షోస్ క్యాన్సిల్ చేసేస్తున్నారు.
Also Read : Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ఓవర్సీస్ బయ్యర్స్ కి ఈ చివరి నిమిషంలో కంటెంట్ జాప్యాలు నిరంతర సిరియల్ లా మారింది. దాంతో విదేశీ పంపిణీదారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. దాంతో పాటు అక్కడి థియేటర్ చైన్‌లు క్రమంగా మన బయ్యర్స్ పై నమ్మకాన్ని కోల్పోతున్నాయి. భారీగా షోస్ అలకేట్ చేయడం తీరా కంటెంట్ అందక షోస్ క్యాన్సిల్ చేయడం. అదేమంటే పర్ఫెక్షన్ కోసం వర్క్ జరుగుతుందని సాకు చెప్పడం. పోనీ ఫైనల్ అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారా అంటే అది లేదు. ఓవర్సీస్ ప్రింట్‌లు ఎప్పుడు లిప్-సింక్ సమస్యలు, నాసిరకం మిక్సింగ్, పూర్ VFX మరియు ఫార్మాట్ లోపాలు వంటి సమస్యలతో ఇస్తున్నారు. అంత నాసిరకంగా ఉన్న కూడా నిర్మాత చెప్పిన ధరకు పంపిణీదారులు చెల్లించాల్సి వస్తుంది. క్వాలిటీ గురించి అడిగితె మాత్రం నిర్మాణ సంస్థలు నోరుమెదపవు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి మాత్రమే కంటెంట్‌ను ముందుగానే లాక్ చేసి డెలివరీ చేసి IMAX, డాల్బీ విజన్ మరియు ఇతర ఫార్మాట్‌లు పర్ఫెక్ట్ గా కంటెంట్ అందిస్తారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాను కొనేవారు ఉండరు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!