పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు..
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు..
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి పెళ్లి పీటలెక్కనున్నారు. గత ఏడాదిలో డిసెంబర్ లో నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు…
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్లో 1990 నాటి బ్యాగ్డ్రాప్తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు…
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయింది అంటూ ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి.దీనితో చిత్ర యూనిట్ ఇటీవల స్పందించింది.ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే.. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే, ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.హరిహర వీరమల్లు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు.