Chandrabau-Pawan Kalyan: చంద్రబాబుది డైరెక్షన్.. పవన్‌ది యాక్షన్: మంత్రి వేణుగోపాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెప్పుకొచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో నేడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడు. చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. నాకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ కళ్యాణ్ ఒక జాతిని అవమానించినట్లే. పవన్ కళ్యాణ్‌కి స్వేచ్ఛ లేదు. నిన్న జరిగిన జెండాని సభకి జెండా లేదు’ అని అన్నారు.
Also Read
Also Read: YS Jagan: రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు: మంత్రి కాకాణి
‘ఇన్ని రోజులూ పవన్ కళ్యాణ్‌కు పిచ్చి, ఉన్మాదం ఉందనుకున్నా. ఆయన మాటలు చూస్తే.. ఆ పరిధి దాటినట్లుంది. ఆశించిన మేర ప్రజలు రాకపోవడంతో అసహనానికి గురైనట్లు కనిపించారు. నేను పిచ్చోడిని, నన్ను నమ్మి ఓట్లు వేయవద్దని చెప్పేందుకు పవన్ వచ్చినట్లుంది. చంద్రబాబు వామానావతరం ఎత్తి కళ్యాణ్‌ను తొక్కారు. పవన్ కూడా ఆ అవతారం ఎత్తి.. నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను తొక్కారు. జెండా సభ ఫ్లాఫ్ అయింది. 6 లక్షల మంది వస్తారన్నారు, 10 శాతం కూడా రాలేదు. జెండా సభ రెండు సామాజిక వర్గాలు పెట్టిన సభగా ఉంది. తెలుగుదేశం జెండాను మోయడమే పవన్ లక్ష్యమా?’ అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!