ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న టీడీపీ - జనసేన.. ఉమ్మండిగా తొలి జాబితాను ప్రకటించాయి.. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.. ఎనిమిది సెగ్మెంట్లల్లో టీడీపీ.. ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు..
జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ క్రమంలో సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని.. మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ- జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు చోటు కల్పించారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని... మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. దీనిని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రోడ్లపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. అంతేకాకుండా.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత…